‘ఆర్జీవీ మిస్సింగ్’ ఫస్ట్ లుక్… వర్మ చేతులకు బేడీలు…!


సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) అనే జోనర్ లో సినిమా అంటూ ”ఆర్జీవీ మిస్సింగ్” ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘ఆర్జీవీ మిస్సింగ్’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు వర్మ. ఈ సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేస్తూ ఇది తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా అని.. దీనికి పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్ – మెగా ఫ్యామిలీ – మాజీ ముఖ్యమంత్రి మరియు పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అనుమానితులని పేర్కొన్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ గోపాల్ వర్మ బేడీలతో ఇన్నోసెంట్ ఫేస్ తో కనిపిస్తున్నాడు. దీనికి అమాయకమైన బాధితుడు అని పేర్కొనడం ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా టీవీ బ్రేకింగ్ న్యూస్ లో ‘ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్ – మెగా ఫ్యామిలీ – మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడు అనుమానితులని’ వస్తున్నట్టుగా పోస్టర్ లో చూపించారు. వర్మ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మిస్తున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రంలోని పీకే లుక్ పోస్టర్ ను విడుదల చేస్తానని వర్మ తెలిపారు.

కాగా వర్మ ‘ఆర్జీవీ మిస్సింగ్’ సినిమాని అనౌన్స్ చేస్తూ.. ”ఇదొక ఫిక్షనల్ రియాలిటీ సినిమా అని.. ఆర్జీవీ మిస్సింగ్ అని తెలిసిన కంపెనీ స్టాఫ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.. మొదట్లో పోలీసులు ఇది ఆ వివాదాస్పద డైరెక్టర్ పబ్లిసిటీ స్టంట్ అని భావిస్తారు. చివరికి అది సీరియస్ అని రియలైజ్ అవుతారు. అప్పుడు ఆర్జీవీ మిస్సింగ్ కేసులో ప్రధాన నిందితులు ముగ్గురు.. పవర్ఫుల్ స్టార్ ఫ్యాన్స్ – ముంబై అండర్ వరల్డ్ కు కాంట్రాక్ట్ ఇచ్చిన మెగా ఫ్యామిలీ – మాజీ ముఖ్యమంత్రి మరియు ఫ్యాక్షనిస్టుల సహాయం తీసుకునే అతని కుమారుడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెడతారు” అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంలో ప్రవన్ కళ్యాణ్ – ఒమేగా స్టార్ – సీబెఎన్ (CBEN) – లాకేష్ – WHY S జగన్ – KCAR – KTAR తో పాటు పోలీసులు గ్యాంగ్ స్టర్స్ ఫ్యాక్షనిస్టులు కూడా నటించనున్నారని చెప్పుకొచ్చాడు.