తెలుగు బుల్లి తెరపై నటి రోహిణిది చాలా ప్రత్యేకమైన శైలి. బిగ్ బాస్ తో పాటు పలు షోల్లో కనిపించిన రోహిణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ను ఎంటర్ టైన్ చేయడంతో పాటు అందరిని ఆకట్టుకునేలా పోస్ట్ లు షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు లైవ్ చాట్ చేసింది. కేవలం క్రేజీ ప్రశ్నలు మాత్రమే అడగాలంటూ నెటిజన్స్ ను కోరింది. దాంతో రక రకాలుగా జనాలు ప్రశ్నలు అడిగారు.
ఎక్కువ మంది మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ ప్రశ్నించారు. అందుకు సమాధానంగా అబ్బాయి దొరికినప్పుడు అంటూ సమాధానం ఇచ్చింది. ఇక మీ వయసు ఎంత అంటూ ఒకరు ప్రశ్నించగా తన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి నువ్వే లెక్క చేసుకో అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చింది. లవర్ ఉన్నాడా అంటూ ప్రశ్నించగా నో అంటూ చాలా గట్టిగా చెప్పింది. అషు రెడ్డి సరదాగా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ కామెంట్ పెట్టగా నువ్వు రావే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ కామెడీ చేసింది. మొత్తానికి రోహిణి సరదా సరదాగా చిట్ చాట్ చేసింది.