సినిమాకు ప్రమోషన్స్ అనేది ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ఒక్క పాట హిట్ అయితే ఇక ఆ సినిమాకు ఎంత పెద్ద ప్లస్ అవుతుందనేదానికి చాలానే ఉదాహరణలు ఉన్నాయి. అల వైకుంఠపురములో చిత్రానికి సూపర్ హైప్ రావడానికి పాటలు ఎంత ప్లస్ అయ్యాయో మనం చూసాం.
ఇక ఈ ఏడాది సౌత్ కు సంబంధించి మాత్రం ఒక పాట రికార్డులను ఎగరేసుకుపోయింది. ధనుష్, సాయి పల్లవిలు హీరో హీరోయిన్లుగా నటించిన మారి 2లోని రౌడీ బేబీ సాంగ్ ఒక సెన్సేషన్. సినిమాకు హైప్ రావడానికి ఈ సాంగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. గతేడాది వ్యూస్ పరంగా రికార్డులను సృష్టించింది ఈ పాట. ఇక ఈ ఏడాది కూడా ఈ పాటదే రికార్డు. ఏకంగా 1 బిలియన్ వ్యూస్ ను సాధించి సౌత్ ఇండియా నుండి మొదటి పాటగా నిలిచింది. ఆదాయపరంగానూ ఈ పాట టాప్ ప్లేస్ లో నిలిచింది.
యువన్ శంకర్ రాజా సంగీతం, ప్రభుదేవా కొరియోగ్రఫీ, ధనుష్, డీకేల సింగింగ్ వెరసి రౌడీ బేబీను సెన్సేషన్ చేసాయి. ఇక ఈ పాట ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.