ఇండియన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న దర్శకుడు రాజమౌళి మహేష్ బాబు సినిమా లో ఎప్పుడు మొదలుపెడతాడా అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టు స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకంటే ఇప్పటివర కు పూర్తిస్థాయి లో పనులు అయితే పూర్తికాలేదు. ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను మాత్రం సిద్ధం చేశాడు.
దర్శకుడు ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ ను పక్కా ప్రణాళికతో సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక ఈ ఏడాది డిసెంబర్లోనే ప్రాజెక్టు ను అఫీషియల్ గా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడాని కి ముందు రాజమౌళి మహేష్ బాబు తో అలాగే మరి కొంతమంది టెక్నీషియన్స్ యాక్టర్స్ తో కలిసి వర్క్ షాప్ కూడా నిర్వహించే ఛాన్స్ ఉందట.
పూర్తిస్థాయి లో ప్రాజెక్టు కోసం సిద్ధమైన తర్వాతనే షూటింగ్ మొదలుపెట్టాలి అని చూస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే RRR సీక్వెల్ కు సంబంధించిన అనేక రకాల విషయాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ సినిమా కు సీక్వెల్ ఉంటుంది అని గతం లోనే చాలా రకాల కథనాలు అయితే వెలువడ్డాయి. అయితే ఇటీవల రచయిత విజయేంద్రప్రసాద్ ను అదే విషయం పై సందేహాలు అడగగా ఆయన చాలా క్లియర్ గా ఒక విషయం అయితే చెప్పారు.
RRR 2 కోసం ప్రణాళికలు కలిగి ఉన్నారని దానిని హాలీవుడ్ చిత్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అని అన్నారు. తప్పకుండా ఎన్టీఆర్ రాజమౌళి కలయిక మరోసారి ఉంటుందని కూడా అన్నారు. ఇక ఈ అప్డేట్ ఇవ్వడం తో ఫాన్స్ లో ఇప్పుడు ఈ విషయం ఆసక్తికరంగా మారింది. హాలీవుడ్ రేంజ్ లో దర్శకుడు జక్కన్న రాబోయే రోజుల్లో సరికొత్త మేకింగ్ విధానాన్ని ప్రజెంట్ చేయబోతున్నట్లుగా అర్థం అవుతుంది.
ఎక్కువగా ఇండియన్ కథల తోనే హాలీవుడ్ రేంజ్ లోనే ప్రజెంట్ చేయాల ని ఆలోచిస్తున్నట్లుగా ఆయన గతంలోనే తెలియజేశారు. ఇక RRR సినిమా ఇప్పటికే వరల్డ్ వైడ్ గా మంచి బజ్ క్రియేట్ అందుకుంది. ఇక ఆ క్రేజ్ తో సీక్వెల్ తెర పైకి తీసుకు వస్తే మాత్రం ఆయన రేంజ్ మరో లెవెల్ కు వెళ్లినట్లే. మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.