‘ఆర్ఆర్‌ఆర్‌’ లో ఆ సన్నివేశం కన్నీరు పెట్టించనుందట

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ప్రతి సన్నివేశం అద్బుతంగా విజువల్ వండర్ అన్నట్లుగా ఉంటుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ పులితో చేసే ఫైటింగ్‌ అద్బుతం అన్నట్లుగా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా సినిమాకు సంబంధించిన మరో వార్త ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలో వచ్చే జైలు సన్నివేశం ప్రతి ఒక్కరితో కన్నీరు పెట్టించే విధంగా ఉంటుందని అంటున్నారు.

కాల భైరవ ఆ సన్నివేశంకు బ్యాక్‌ గ్రౌండ్ సాంగ్ పాడాడట. ఆ పాట సమయంలో ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ లు ఇద్దరు కూడా జైల్లో ఉంటారు. ఆ సన్నివేశం అత్యంత హృదయ విదారకంగా ఉంటుందని మేకర్స్‌ నుండి సమాచారం అందుతోంది. అద్బుతమైన విజువల్‌ వండర్ గానే కాకుండా సెంటిమెంట్‌ తో కూడా ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి అద్బుతంగా తెరకెక్కించినట్లుగా చెబుతున్నారు. సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్న సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ రావడంతో షూటింగ్‌ నిలిచి పోయింది.