ఆర్ ఆర్ ఆర్: టాలీవుడ్ లోనే అత్యంత ఖరీదైన పాట

ఎస్ ఎస్ రాజమౌళి ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఇప్పుడు శిఖరాగ్రాన్ని చేరుకున్నాడు. బాహుబలి తర్వాత అంతకు మించిన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ ను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఒక్క పాట తప్ప షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకుంది.

వచ్చే నెలలో ఆ పాటను చిత్రీకరించనున్నారు. ఉక్రెయిన్ లో షూట్ చేయనున్న ఈ పాట టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సాంగ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి తగ్గ ఏర్పాట్లు సాగుతున్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, ఒలీవియా మోరిస్ లతో ఈ సాంగ్ ను పిక్చరైజ్ చేస్తారు.

బాహుబలిలో రాజమౌళి సాంగ్స్ పిక్చరైజేషన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతో దాన్ని మరో లెవెల్ కు తీసుకెళ్లనున్నాడు. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానున్న విషయం తెల్సిందే.