ఆర్ ఆర్ ఆర్ దోస్తీ సాంగ్ గురించి స్పందించిన హేమచంద్ర

ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ షురూ అవుతున్నాయి. ఎస్ ఎస్ రాజమౌళి ఓ రేంజ్ లో ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తాడు. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ నుండి మొదటి పాట దోస్తీని ఆగస్ట్ 1న విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా ప్రముఖ సింగర్ హేమ చంద్ర ఆలపించాడు.

రీసెంట్ గా ఒక వీడియోలో హేమ చంద్ర దోస్తీ సాంగ్ గురించి స్పందించాడు. ఈ సాంగ్ పాడటం తన కల అని చెప్పాడు. మొదటిసారి రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ లో సాంగ్ పాడటం అద్భుత అనుభూతినిచ్చిందని తెలిపాడు.

ఈ సాంగ్ లిరిక్స్ సిరివెన్నెల గారు రాసారని, చాలా అద్భుతంగా వచ్చాయని, అలాగే విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని హేమ చంద్ర రివీల్ చేసాడు. ఈ సాంగ్ ది బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని తెలిపాడు.