RRR గ్లిమ్స్: మైండ్ బ్లోయింగ్ విజువల్స్ – గూస్ బమ్స్ తెప్పిస్తోన్న బీజీఎమ్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ”ఆర్.ఆర్. ఆర్” (రౌద్రం రణం రుధిరం) కోసం సినీ అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫైనల్ గా సంక్రాంతి సందర్భంగా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఓ సర్ప్రైజింగ్ గ్లిమ్స్ ని రిలీజ్ చేసింది.

45 సెకండ్ల పాటు ఉన్న RRR గ్లిమ్స్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ – అమేజింగ్ ఆర్ఆర్ తో అదిరిపోయింది. జక్కన్న యాక్షన్ కు ఎంఎం కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ – సెంథిల్ కుమార్ కెమెరా పనితనం జత కలిసి గూస్ బమ్స్ తెప్పిస్తోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ – కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టారని ఈ స్మాల్ వీడియో చూస్తేనే అర్థం అవుతోంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి RRR తో భారతీయ సినిమాకు పూర్వవైభవాన్ని తీసుకురాబోతున్న ఇందులో పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ను పులి వెంబడించడం.. చరణ్ గుర్రం మీద తారక్ బైక్ మీద ఛేజింగ్ చేస్తుండటం.. అజయ్ దేవగన్ ఆంగ్లేయులపై తుపాకులు ఎక్కుపెట్టడం వంటివి RRR గ్లిమ్స్ లో చూడొచ్చు. అలానే హీరోయిన్లుగా నటిస్తున్న అలియా భట్ – ఒలివియా మోరిస్ లతో పాటుగా రాహుల్ రామకృష్ణ ను ఇందులో భాగం చేశారు. చివర్లో ఎన్టీఆర్ నీటితో.. రామ్ చరణ్ నిప్పు పట్టుకొని ఫైట్ చేస్తుండటం.. ఓ సింహం బ్రిటీషర్ పై పంజా విసరడం వంటి విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.

RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథాంశంతో ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాని రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు RRR కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు – టీజర్లు – ఫస్ట్ సింగిల్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా వచ్చిన గ్లిమ్స్ అనూహ్య రెస్పాన్స్