టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి వచ్చిన నాటు నాటు పాట వ్యూస్ రికార్డుల మోత మ్రోగిస్తోంది. తక్కువ సమయంలోనే పది మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న నాటు నాటు సాంగ్ ఇప్పుడు వంద మిలియన్ ల వైపు దూసుకు పోతుంది. ఈ పాట తెలుగు లో మాత్రమే కాకుండా హిందీ.. తమిళం.. మలయాళం మరియు కన్నడంలో కూడా విడుదల అయ్యింది. మొత్తం అయిదు భాషల్లో ఈ పాట విడుదల అయ్యింది. పాట కు ఇప్పటి వరకు ఏకంగా 75 మిలియన్ ల వ్యూస్ వచ్చినట్లుగా యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అన్ని భాషల వర్షన్ లు కలిపి ఈ మొత్తం వ్యూస్ ను యూట్యూబ్ లో దక్కించుకున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు.
కేవలం యూట్యూబ్ లోనే కాకుండా ఇతర ప్లాట్ ఫామ్స్ ల్లో కూడా ఈ పాట సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి పదుల మిలియన్ ల లిజన్స్ ను దక్కించుకుంటుంది. రాజమౌళి సినిమా అంటే కీరవాణి అద్బుతమైన సంగీతాన్ని అందిస్తాడు.. ఆ విషయం మరోసారి నిరూపితం అయ్యింది. ఈ పాటకు అద్బుతమైన డాన్స్ స్పెప్పులు కూడా కుదిరాయి. దాంతో పాటను పదే పదే చూస్తున్నారు. కొన్ని వేల మంది కవర్ సాంగ్ చేశారు. కొన్ని లక్షల మంది ఈ పాటలను తమ డౌన్ లోడ్స్ లో చేర్చుకున్నారు. ఇంతగా పాపులర్ అయిన నాటు నాటు సాంగ్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఈ పాట విడుదల తర్వాత అభిమానుల్లో ఆసక్తి ఎక్కువ అయ్యింది.
రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటించగా హీరోయిన్ గా ఆలియా భట్ నటించింది. ఇంకా ఈ సినిమాలో శ్రియా మరియు ఒలీవియా కూడా నటించారు. నాటు నాటు సాంగ్ లో మొత్తం నటీ నటులను చూపించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బ్రిటీష్ వారి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సన్నివేశాలు పాటలు ఉంటాయని ఈ పాటను చూస్తుంటే అర్థం అవుతోంది. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ సినిమా మరో అద్బుతమైన విజువల్ వండర్ గా జక్కన్న తీర్చి దిద్దాడు అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. దాన్ని సంక్రాంతికి ముందే చూడ్డమే అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ ను వచ్చే నెల డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ యూట్యూబ్ ను మరెంత షేక్ చేస్తుందో చూడాలి.