కపిల్ శర్మ షోలో RRR టీమ్ సందడే సందడి

ఆర్.ఆర్.ఆర్ టీమ్ సునామీ పర్యటనలతో ప్రచారాన్ని హీటెక్కిస్తోంది. కరణ్ జోహార్ షో .. కపిల్ శర్మ షో.. అంటూ ఒకటే ప్రచారం దంచేస్తున్నారు. ఈసారి హిందీ రిలీజ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ముంబైలో భారీ ఈవెంట్ తో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ షోలలో ఒకటైన కపిల్ శర్మ షోలోను ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్రచారం చేస్తోంది. ఇక ఈ షోకోసం రాజమౌళి ఎల్లో డ్రెస్.. చరణ్ ఆరెంజ్ కలర్ షర్ట్ ని ఎంపిక చేసుకోగా తారక్ బ్లాక్ లో కనిపించాడు. ఆలియా భట్ పింక్ లో మెరిసిపోయింది.

కొన్ని నెలల విరామం తర్వాత బుల్లి తెరపైకి పునరాగమనం చేసిన సోనీ టీవీ పాపులర్ షో కపిల్ శర్మ షో ప్రేక్షకులను నిరంతరం అలరిస్తోంది. షో మూడవ సీజన్ లో అదనపు ఎంటర్ టైన్ మెంట్ తో టీఆర్పీల్లో దూసుకెళుతోంది. వీక్షకులు ఈ షోలోని ప్రతి బిట్ ను ఇష్టపడుతున్నారు. కపిల్ శర్మ షో డైహార్డ్ అభిమానులు ఎపిసోడ్ లను చూడటానికి ఎల్లప్పుడూ థ్రిల్లింగ్ గా ఉంటారు. అనేక మంది నటీనటులు తమ చిత్రాలను ప్రమోట్ చేసుకోవడానికి ఒకరి తర్వాత మరొకరు షోను లాక్ చేస్తున్నారో చూస్తున్నదే.

ఈసారి షోకి చాలా ప్రత్యేకత ఉంది. ప్రదర్శన వేదికపై దర్శకధీరుడు రాజమౌళి సహా RRR బృందం సందడి చేయనుంది. రాజమౌళి-చరణ్-రామారావు వేదికపై సందడి చేస్తారు. కపిల్ శర్మ తో సౌత్ స్టార్ల సందడి ఎలా ఉందో చూడాలని అభిమానులంతా ఉత్సాహంగా ఉన్నారు. మునుముందు ఎపిసోడ్ లు ఎంతో ఎగ్జయిట్ చేయనున్నాయని ఆడియెన్ ఉత్సాహంగా ఉండడం ఆర్.ఆర్.ఆర్ కి ప్లస్ కానుంది. ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. హిందీలో అత్యంత భారీ క్రేజుతో విడుదలవుతోంది.

కపిల్ శర్మ షోలో కృష్ణ అభిషేక్- భారతీ సింగ్- సుదేష్ లెహ్రీ- కికు శారదా- సుమోనా చక్రవర్తి- చందన్ ప్రభాకర్ తదితరుల సందడి చెప్పుకోదగ్గది. వీరంతా వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అర్చన పురన్ సింగ్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.