RRR కి బ్రేక్ ఈవెన్ నల్లేరు మీద నడకేనా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` ఎట్టకేలకు మార్చి 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా అనూహ్యంగా వాయిదా పడటంతో అభిమానులకు నిరాశకు గురైనా..ఆ ఎగ్జైట్మెంట్ ని ఏ మాత్రం తగ్గకుండా యూనిట్ వీలైనంత వేగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఏప్రిల్..మే లో రిలీజ్ అవుతుందనుకున్న సినిమా అనూహ్యంగా మార్చిలోనే అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఆ రకంగా అభిమానుల్ని కాస్త ఉత్సాహపరిచారు. రిలీజ్ సమయం దగ్గరపడుతోన్న కొద్ది యూనిట్ లో ఒత్తిడిమైదలైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు అయింది. ముందుగా 300-400 కోట్ల బడ్జెట్ మాత్రమే అంచనా వేసుకున్నారు. కానీ సెట్స్ కి వెళ్లిన తర్వాత బడ్జెట్ అంతకంతకు పెరిగిపోయింది. కోవిడ్ కారణంగా షూటింగ్ వాయిదా పడటం.. అదనంగా మళ్లీ డేట్లు కేటాయించడం వంటి అంశాలతో బడ్జెట్ అదనంగా ఖర్చు అయింది. మొత్తంగా సినిమా పూర్తయ్యే..రిలీజ్ కి వచ్చేసరికి వడ్డీ భారం..ఇతర ఖర్చులు మొత్తం కలుపుకుంటే 500కోట్ల వరకూ ఖర్చుగా తేలినట్లు గుసగు వినిపిస్తోంది.

సినిమాకి బిజినెస్ పరంగా ఎలాంటి ఢోకా లేదు. చరణ్..తరక్ ఇమేజ్..జక్కన్న పాన్ ఇండియా ఇమేజ్ తో పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది. హిందీలో నేరుగా నిర్మాతనే విడుదల చేస్తున్నారు. హిందీ బెల్డ్ లో `పుష్ప` లాంటి సినిమా భారీ వసూళ్లు సాధించడంతో అదే నమ్మకంతో నిర్మాత ఓన్ రిలీజ్ కి రెడీ అయ్యారు. `ఆర్ ఆర్ ఆర్` కూడా ఇదే వేవ్ ని కొనసాగిస్తుందని అంచనాలున్నాయి. ఇక ఓవర్సీస్..తెలుగు రాష్ర్టాలు..కర్ణాటక హక్కులు మంచి ధరకు అమ్మడుపోయాయి.

నాన్ థియేట్రికల్ రూపం లోనే 250 కోట్లు ముందుగానే రాబట్టింది. ఇంకా థియేటర్ల సంఖ్యని వెల్లడించలేదు. ఇప్పుడా పెట్టుబడి సహా పంపిణీదారులు సేఫ్ జోన్ లో ఉండాలంటే థియేట్రికల్ రైట్స్ ద్వారానే మొత్తం రాబట్టాలి. సునాయాసంగా బ్రేక్ ఈవెన్ సాధించి భారీ వసూళ్లు దిశగా పయనించాలి. జక్కన్న `బాహుబలి` వసూళ్లు టార్గెట్ గా `ఆర్ ఆర్ ఆర్` ని రేసులోకి దించుతున్నారు. ఇద్దరు బిగ్ స్టార్లు భాగమైన చిత్రం. అంతకు మించి పాన్ ఇండియా రిలీజ్. మరి టార్గెట్ ని `ఆర్ ఆర్ ఆర్` బ్రేక్ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి. మహరాష్ర్ట మినహా అన్ని రాష్ర్టాల్లో థియేటర్ల ఆక్యుపెన్సీ 100 శాతం ఉంది. కానీ హిందీ రీజియన్ లో మాత్రం ప్రస్తుతానికి 50 శాతం ఆక్యుపెన్సీనే. మార్చి 25 లోపు ఆంక్షలు తొలగిపోయే అవకాశం ఉంది.