ట్రిపుల్ ఆర్ తో ఎవరికి రిలీఫ్ ఎవరికి టెన్షన్?

దర్శకధీరుడు రాజమౌళి అత్యతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ వండర్ ట్రిపుల్ ఆర్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని దాదాపు మూడున్నరేళ్లుగా ప్రేక్షకులు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. గత కొంత కాలంగా వరుసగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ ఎట్టకేలకు మార్చి 25న శుక్రవారం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

కనీ వినీ ఎరుగని కాంబినేషన్ లో అత్యతం పవర్ ఫుల్ స్టోరీతో తెరకెక్కిన మూవీ కావడంతో ఈ చిత్రానికి గత వారం రోజు ముందు నుంచే థియేటర్ల వద్ద హడావిడి మొదలైంది. రిలీజ్ కు ఒక్క రోజు ముందు వరకు వరుస ప్రమోషన్ లతో దేశ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ టీమ్ హల్ చల్ చేసింది. రాజమౌళితో పాటు ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి దేశ వ్యాప్తంగా సినిమాని ప్రచారం చేశారు. ఏ ఒక్క రోజు కూడా రిలీఫ్ అనేది లేకుండా శ్రమించారు. వారి శ్రమకు తగ్గ ఫలితం శుక్రవారం లభించింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రీమియర్స్ షో నుంచే ఈ చిత్రానికి యునానిమస్ టాక్ రావడంతో చిత్ర బృందం సంబరాల్లో మునిగితేలుతోంది. ఇన్నేళ్లు పడిన కష్టానికి బిగ్ రిలీఫ్ దొరికినట్టుగా భావిస్తున్నారు. ఈ మూవీతో ఇద్దరు హీరోలకు పాన్ ఇండియా స్థాయి బ్లాక్ బస్టర్ లభించింది. దీంతో చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. హీరోలు కూడా తమకు ఇక బిగ్ రిలీఫ్ దొరికిందని హ్యాపీగా ఫీలవుతున్నారట.

అయితే ఇద్దరు హీరోల్లో ఎన్టీఆర్ కు మాత్రమే ఈ మూవీతో రిలీఫ్ లభించిందని చరణ్ కు టెన్షన్ ముందుందని అంటున్నారు. ఎన్టీఆర్ కు ఈ మూవీ తరువాత మరో సినిమా రిలీజ్ కు రెడీగా లేదు. ప్రారంభించడానికి మాత్రమే రెడీగా వుంది. కానీ చరణ్ పరిస్థితి అలా కాదు శంకర్ తో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ కు ఇటీవల బ్రేకిచ్చారు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా చరణ్ కు బ్రేకిచ్చారు.

ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి మళ్లీ మొదలుపెట్టబోతున్నారట. అంటే కాకుండా ఏప్రిల్ లో చిరుతో కలిసి చరణ్ నటించిన `ఆచార్య` రిలీజ్ కాబోతోంది. దీనికి కూడా చరణ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి.. నో రిలీఫ్ అందుకే ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ కి రిలీఫ్ కానీ చరణ్ కి కాదని చెబుతున్నారు.