దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ తారలతో పాటు హాలీవుడ్ తారలు కూడా నటిస్తున్నారు. కోవిడ్ పాండెమిక్ తర్వాత అందరి డేట్స్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని షూటింగ్ ని ఫినిషింగ్ దశగా తీసుకెళ్తున్నారు. ఈ నెలలోనే అలియా భట్ కూడా షూటింగ్ లో పాల్గొననుంది.
అలాగే ఇందులో మెయిన్ విలన్ గా కనిపించనున్న అలిసన్ డూడీ కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం ఇండియా బయల్దేరినట్టు పోస్ట్ కూడా చేసింది. దీంతో అసలేం షూటింగ్ జరుగుతోందా అనే విషయాన్ని తెలుసుకోగా.. రాజమౌళి సినిమాల్లో ఇంటర్వల్ బ్లాక్ అంటే చాలా ప్రత్యేకం.. సినిమాని ఒక్కసారిగా పతాక స్థాయికి తీసుకెళ్లేలా చేయడమే కాకుండా ప్రేక్షకులకి సెకండాఫ్ మీద భీభత్సమైన అంచనాలను పెంచేస్తుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి నైట్ ఎఫెక్ట్ లో ఇంటర్వెల్ బ్లాక్ ని షూట్ చేస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్, లింగంపల్లి లో వేసిన ఓ సెట్లో రామ్ చరణ్ – ఎన్.టి.ఆర్ మధ్య హై ఓల్టేజ్ యాక్షన్ బ్లాక్ ని షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ బ్లాక్ థియేటర్స్ లో ప్రేక్షకులందరికీ పిచ్చెక్కిపోయేలా ఉంటుందని సమాచారం. ఈ సీన్ కోసం హాలీవుడ్ యాక్టర్స్ కూడా షూట్ లో జాయిన్ అవుతున్నారని సమాచారం.