మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయిన విషయం కొన్ని నిమిషాల వ్యవధిలో తెలుగు వారందరికి తెలిసి పోయింది. అయితే మొదట తెలిసింది మాత్రం అల్లు అర్జున్ కు అంటూ సమాచారం అందుతోంది. తేజ్ ను మొదట యాక్సిడెంట్ అయిన వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ బన్నీ సన్నిహితులు ఉండటంతో కాకినాడలో ఉన్న బన్నీకి వెంటనే విషయాన్ని తెలియజేయడం జరిగింది.
బన్నీకి తెలిసిన వెంటనే ఆయన స్వయంగా చిరంజీవి ఇంటికి కాల్ చేశారట. ఆ సమయంలో సురేఖ గారు ఇంట్లో ఉండటంతో ఆమెకు మొదట తెలియజేయడం జరిగింది. ఆవెంటనే మెగా కుటుంబం మొత్తంకు విషయం వెళ్లింది. మొదట తనకే తెలిసినా కూడా ఇప్పటి వరకు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో స్పందించడం కాని డైరెక్ట్ గా వెళ్లి చూడటం కాని బన్నీ చేయడం లేదు. మెగా ఫ్యామిలీకి కాస్త దూరం అన్నట్లుగా బన్నీ ఉంటాడు అంటూ టాక్ ఉంది. అది నిజమేనా అని ఈ సంఘటనతో అనిపిస్తుంది.