ఇటీవలే మెగా ఫ్యామిలీలో నిహారిక కొణిదెల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరై పెళ్లిలో సందడి చేసారు. అయితే ఈ ఈవెంట్ తర్వాత మెగా ఫ్యామిలీలో తర్వాత జరగబోయే పెళ్లి ఎవరిది అనే ప్రశ్న రావడం సహజం. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో చాలా మంది ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారు.
ఇదే ప్రశ్న ఒక ఇంటర్వ్యూలో సాయి తేజ్ ను అడగ్గా తనకంటే శిరీష్ పెద్దవాడని, మెగా ఫ్యామిలీలో ముందుగా తన పెళ్లే అవుతుందని అన్నాడు. దీంతో త్వరలోనే శిరీష్ పెళ్లి అంటూ అందరూ కథనాలు ప్రచురించారు.
ఈ విషయంపై శిరీష్ స్పందిస్తూ తేజ్ సరదాగా ఆ మాట అని ఉంటాడని ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే పైకి అలా అన్నా కానీ తేజ్ మాటలకు శిరీష్ హర్ట్ అయినట్లు క్లోజ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అవసరం లేకపోయినా ఈ విషయంలోకి తన పేరు లాగడం ఏ మాత్రం బాగోలేదని శిరీష్ ఫీలవుతున్నాడట.