దుమ్ము రేపిన సాయి పల్లవి ‘సారంగదరియా’

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలోని సారంగదరియా పాటను నిన్న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ పాట విడుదలకు ముందు నుండే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సమంత చేతుల మీదుగా విడుదల చేసిన ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ పాట విడుదల అయిన కేవలం 24 గంటల్లోనే ఏకంగా 6 మిలియన్‌ ల వ్యూస్‌ ను దక్కించుకుంది. ఒక పాట ఈ రేంజ్ లో వ్యూస్‌ ను దక్కించుకోవడం రికార్డుగా చెబుతున్నారు.

సారంగదరియా పాట ఇప్పటికే చాలా ఫేమస్, దాన్ని సాయి పల్లవి ఎనర్జికి తగ్గట్లుగా ట్యూన్‌ చేసి మంగ్లీ వాయిస్‌ తో పాడించారు. దాంతో పాట అదిరి పోయింది. ఇక ఈ పాటలో సాయి పల్లవి డాన్స్‌ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాటకు 24 గంటల్లోనే ఆరు మిలియన్స్‌ వ్యూస్‌ మరియు మూడు లక్షల లైక్స్ రావడం పట్ల చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అవాక్కయి మరీ చూస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఫిదా కాంబో అవ్వడంతో మళ్లీ ఫిదా చేయడం ఖాయం అంటున్నారు.