పవన్ కళ్యాణ్ వంటి స్టార్ తో నటించే అవకాశం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చిన్న పాత్ర లేదా పెద్దదా అనే విషయాన్ని ఆలోచించకుండా ఆయన సినిమా లో హీరోయిన్ గా నటించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయనతో నటించేందుకు రెండు సార్లు అవకాశం వస్తే రెండు సార్లు కూడా వద్దని పక్కకు తప్పుకుంది అంటూ సాయి పల్లవి విషయమై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మోస్ట్ హ్యాపెంనింగ్ బ్యూటీ అయిన సాయి పల్లవి పవన్ కు రెండు సార్లు హ్యాండ్ ఇచ్చిందట.
వకీల్ సాబ్ సినిమా లో హీరోయిన్ పాత్ర చిన్నది ఉంది. దానికి మొదట సాయి పల్లవిని అనుకున్నారు. ఆమె చిన్న పాత్రను చేయను అంటూ వదిలేసింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రను మాత్రమే చేస్తాను అంది. పవన్ కళ్యాణ్ తాజాగా రానాతో కలిసి నటిస్తున్న సినిమా లో సాయి పల్లవి ని ఎంపిక చేశారు. నటించేందుకు ఆమె కూడా ఓకే చెప్పింది. కాని షూటింగ్ కు డేట్లు ఇవ్వలేక ఆమె మళ్లీ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలో సాయి పల్లవి నటించిన విరాట పర్వం మరియు లవ్ స్టోరీ సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.