విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మరియు లవ్ స్టోరీ సినిమా ల్లో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి మరో ఆఫర్ ను దక్కించుకుంది. ఇటీవలే శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమాను ధనుష్ హీరోగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఆయన తో శేఖర్ కమ్ముల సినిమా పాన్ ఇండియా లెవల్ లో ఉండబోతుంది. ఈ ప్రాజెక్ట్ కు సాయి పల్లవి హీరోయిన్ అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ధనుష్ మరియు శేఖర్ కమ్ముల ఆమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ధనుష్ తో మారి 2 లో సాయి పల్లవి నటించింది. పైగా శేఖర్ కమ్ములతో రెండు సినిమా ల్లో వర్క్ చేసింది. కనుక ఈ కాంబో పర్ఫెక్ట్ అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం ధనుష్ చేస్తున్న సినిమా లు పూర్తి అయిన తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. హీరోయిన్ విషయం ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.