స్టార్‌ హీరోయిన్ల మధ్య డిజిటల్‌ వార్‌

వెండితెరపై స్టార్‌ హీరోయిన్‌గా చెలామణి అవుతూనే, వెబ్‌ సిరీస్‌లోనూ దూసుకుపోతున్నారు టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు సమంత, కాజల్‌. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ, ఎప్పటికప్పుడు తమ పర్ఫార్మెన్స్‌తో అలరిస్తూనే ఉన్నారు. ఇప్పడు ఈ ఇద్దరు స్టార్‌ హీరోయిన్ల మధ్య డిజిటల్‌ వార్‌ నెలకొంది. దీనికి కారణం వీరు తొలిసారిగా నటించిన వెబ్‌ సిరీస్‌లు ఒకేరోజు విడుదల అవ్వడమే.

సమంత నటించిన వెబ్‌ సిరీస్‌ ది ఫ్యామిలీ మ్యాన్-2 ఫిబ్రవరి 12న ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో మనోజ్‌ బాజ్‌పేయి, ప్రియమణి ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక కాజల్‌ నటించిన వెబ్‌ సిరీస్‌ ‘లైవ్‌ టెలికాస్ట్‌’ సైతం అదే రోజున డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ వీఐపీలో ప్రీమియర్‌ కానుంది. వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ఈ సిరీస్‌లో వైభవ్, ఆనంది కీలక పాత్రలు చేశారు. సస్పెన్స్, హారర్‌ థ్రిల్లర్‌గా ఈ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. థ్రిల్లర్‌ జోనర్‌లో కాజల్‌ నటించడం ఇదే తొలిసారి. తమ ఫేవరెట్‌ హీరోయిన్లు ఒకేరోజు డిజిటల్‌ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వనుండటంతో సమంతా, కాజల్‌ ఫ్యాన్స్‌ మధ్య కూడా వార్‌ నడుస్తోంది.