బాలీవుడ్‌ కు సౌత్‌ సినిమా ఇండస్ట్రీలకు తేడా అదే

సౌత్‌ లో లేడీ సూపర్‌ స్టార్ గా గుర్తింపు దక్కించుకుని తెలుగు మరియు తమిళంలో నెం.1 హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ సమంత ఈమద్య కాలంలో కమర్షియల్‌ పాత్రల కంటే కంటెంట్ ఓరియంటెడ్‌ కథలకు పాత్రలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నాడు. తాజాగా ఈ హీరోయిన్‌ బాలీవుడ్‌ కు కూడా వెళ్లింది. అక్కడ ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2 లో పాకిస్తానీ ఉగ్రవాదిగా కనిపించబోతుంది. ఆ పాత్రతో సమంత తనలో తాను కొత్తగా ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలోనే ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.

బాలీవుడ్‌ లో నటీనటులకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. వారు ఎలాంటి పాత్రలు అయినా చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి పాత్రలు చేస్తే చూడరేమో అనే ఆందోళన ఉండదు. కాని సౌత్ లో మాత్రం అలా కాదు. హీరోయిన్స్ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలను చేసేందుకు ప్రేక్షకులు ఒప్పుకోరు అంటూ ఆమె పేర్కొంది. సౌత్‌ హీరోయిన్స్‌ తో పాటు హీరోలు కూడా ఎక్కువగా నెగటివ్‌ గా కనిపించరు. సౌత్‌ ప్రేక్షకులు హీరోలను హీరోయిన్స్ ను తమ మైండ్‌ లో ఒక లా డిజైన్‌ చేసి పెట్టుకుంటారు. దానికి విరుద్దంగా ఏదైనా ఉంటే ఒప్పుకోరు అంటూ అక్కడి ఇక్కడి ప్రేక్షకులకు ఇండస్ట్రీలకు తేడాను సమంత చెప్పుకొచ్చింది.