నటన నుండి బ్రేక్ తీసుకుంటున్న సమంత

సమంత హీరోయిన్ గా ఇప్పటికే టాప్ రేంజ్ కు చేరుకుంది. గ్లామరస్ రోల్స్ నుండి కథా ప్రాధాన్యమున్న చిత్రాలకు తన ప్రయాణాన్ని మార్చుకున్న సమంత రీసెంట్ గా శాకుంతలం షూట్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తమిళ చిత్రం కాతు వాక్కుల రెండు కాదల్ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రం పూర్తైన తర్వాత సమంత నటన నుండి బ్రేక్ తీసుకోనుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆమే తెలియజేసింది. ఇక వచ్చే ఏడాదే ఆమె కొత్త సినిమాలను సైన్ చేయనుంది. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో రాజి పాత్రతో సమంత ఇండియా వైడ్ గా అభిమానులను సంపాదించుకుంది.

అయితే ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర ద్వారా కొంత కాంట్రవర్సీ కూడా క్రియేట్ అయింది. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్న వారికి తన క్షమాపణలు అని తెలిపింది సమంత.