నేను హైదరాబాద్‌ వదిలి పెట్టను : సమంత

టాలీవుడ్ స్టార్‌ క్యూట్ కపుల్ సమంత మరియు నాగచైతన్యలు విడి పోయారు.. వారిద్దరు కూడా త్వరలో విడాకులు తీసుకుంటారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ప్రస్తుతం వేరు వేరుగా ఉండటం జరుగుతుందని.. సమంత చెన్నకు వెళ్లగా చైతూ హైదరాబాద్‌ లోనే ఉంటున్నాడు. సమంత ఇక షూటింగ్ లకు తప్ప హైదరాబాద్‌ వచ్చే అవకాశం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో సమంత ఆ వార్తలపై చెక్ పెట్టింది.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు స్పందించింది. తాను ఖచ్చితంగా హైదరాబాద్‌ కు వెళ్తాను. నేను హైదరాబాద్‌ ను నా సొంత ఇంటిగా భావిస్తాను. హైదరాబాద్‌ ను వదిలి పెట్టేది లేదు అంటూ తేల్చి చెప్పింది. నాగచైతన్యతో వివాహ బందం గురించి మాత్రం ఆమె స్పందించలేదు. గత కొన్ని వారాలుగా కంటిన్యూగా ఇద్దరు విడి పోయారు అటూ వార్తలు వస్తున్నాయి. వాటికి సమాధానం లేదు కనుక ఖచ్చితంగా ఇద్దరు బ్రేకప్ అయ్యారు అంటూ నెటిజన్స్ ఒక అభిప్రాయంకు వచ్చేశారు.