సమంత హాట్‌ ఫొటోలపై శ్రీరెడ్డి హాట్‌ కామెంట్స్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈ మద్య కాలంలో వరుసగా హాట్‌ ఫొటో షూట్ లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. ఆమె చేస్తున్న ఫొటో షూట్‌ లు వివాదాస్పదం అవుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీ అభిమానులు కొందరు సమంత ఫొటోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాల్లో కాస్త పద్దతిగా నటిస్తున్నా సోషల్‌ మీడియాలో మాత్రం హాట్ ఫొటో షూట్‌ లు షేర్‌ చేస్తుంది. ఆ ఫొటోలపై వివాదాస్పద నటి అయిన శ్రీ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేసింది.

శ్రీరెడ్డి మాట్లాడుతూ… అక్కినేని ఫ్యామిలీ కి చెందిన అమలా గారు ఎంత మంచి డ్రస్‌ లు వేసుకుంటారు. నమ్రత కూడా మహేష్‌ బాబు కు ఎంతో సపోర్ట్ గా నిలుస్తారు. మహేష్‌ బాబు గారి సక్సెస్‌ లో ఆమె కీలకంగా ఉన్నారు. మీరు కూడా నాగచైతన్య కు మద్దతుగా ఉండొచ్చు కదా. బట్టలిప్పి మరీ ఎందుకు రచ్చ చేస్తున్నారు. నువ్వు సెక్సీగా కనిపించేందుకు బట్టలు వేసుకున్నంత మాత్రాన సెక్సీగా కనిపించవు. నువ్వు క్యూట్‌ గా ఉంటావు. దయచేసి నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకు. తమిళ అమ్మాయివి అయినా కూడా తెలుగబ్బాయిని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి అయ్యాక కాస్త లిమిట్స్ లో ఉండాల్సిన అవసరం ఉంది. నాగచైతన్య లైఫ్‌ మీద దృష్టి పెట్టు అంటూ సమంతకు శ్రీరెడ్డి సలహా ఇచ్చింది.