బాలీవుడ్ చిత్రాన్నీ ప్రకటించనున్న సమంత?

సమంత అక్కినేని నుండి మళ్ళీ సమంత రుత్ ప్రభుగా మారిపోయింది సామ్. స్టేటస్ సింగిల్ కావడంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని తన స్నేహితులతో ట్రిప్స్ కు వెళ్ళొచ్చింది సమంత. అలాగే సినిమాల పరంగా దూసుకుపోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే రెండు తెలుగు-తమిళ్ బైలింగ్వల్ ప్రాజెక్ట్స్ ను సైన్ చేసిన విషయం తెల్సిందే. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్ లు మొదలవుతాయి.

ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాన్ని సైన్ చేసిందని అంటున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించిన తర్వాత సమంత పేరు బాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఆమెకు ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి. అయితే అప్పుడు వద్దనుకున్న సమంత మాత్రం ఇప్పుడు బాలీవుడ్ వైపు ఆసక్తి చూపిస్తోంది.

తాప్సి నెలకొల్పిన నిర్మాణ సంస్థ అవుట్ సైడర్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరిన్ని విశేషాలు త్వరలోనే తెలిసే అవకాశాలున్నాయి.