కొత్త బ్రాండ్ పట్టిన సమంత

టాలీవుడ్‌ స్టార్స్‌ వరుసగా పెద్ద పెద్ద కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ లు గా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో వారు చిన్న కంపెనీలను కూడా వదిలి పెట్టకుండా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు సిద్దం అవుతున్నారు. ఏదైనా కూడా పారితోషికం సమానంగా వస్తున్న కారణంగా దేనికి అయినా ఓకే అన్నట్లుగా ముందుకు వస్తున్నారు. సమంత ఇప్పటికే పలు కంపెనీలకు అంబాసిడర్‌ గా వ్యవహరిస్తుంది. ఇప్పుడు సమంత కొత్తగా మరో బ్రాండ్‌ ను పట్టింది.

కొత్త సంవత్సరం కానుకగా సమంత ను తమ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్ గా విజయలక్ష్మి డీర్ మినుపగుళ్లు ప్రకటించింది. ఒక వైపు యాంకర్‌ సుమ తెనాలి డబుల్‌ హార్స్ మినుపగుళ్లుకు ప్రమోట్‌ చేస్తుండగా మరో వైపు సమంత ఇలా విజయలక్ష్మి డీర్ మినుపగుళ్లు కు ప్రమోటర్ గా ముందుకు వచ్చింది. కొత్త గా సమంత ఎంపిక అయిన ఈ ఒప్పందం సంవత్సరం వరకు కంటిన్యూ అవుతుందని తెలుస్తోంది. భారీ మొత్తంలో ఇందుకు గాను సమంత పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.