ఫోటో స్టోరి: చెలరేగడంలో సామ్ అన్ స్టాపబుల్

అక్కినేని నాగచైతన్య నుంచి విడిపోయిన అనంతరం సమంత కెరీర్ పరంగా మరింత స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. కొన్ని వరుస విహార యాత్రల అనంతరం పూర్తిగా కెరీర్ పైనే శ్రద్ధ వహిస్తోంది. పుష్ప నుంచి సమంత ఐటమ్ నంబర్ ఊ అంటే.. ఇప్పటికే ట్రెండ్ సెట్ చేస్తోంది. డిసెంబర్ 17న విడుదల కానున్న పుష్పలో సామ్ అప్పియరెన్స్ వెరీ స్పెషల్ అని ప్రూవైంది.

ఇటు తెలుగు అటు తమిళం హిందీలోనూ నటించేందుకు వరుస ప్రాజెక్టులకు సమంత కమిటైంది. ఇకపోతే తీరిక వేళల్లో షాపింగ్ మాల్స్ రిబ్బన్ కటింగులకు ఎటెండవుతూ తిరుమలేశుని సందర్శనానికి ఆసక్తిని కనబరిచింది.

మరోవైపు తనలోని ఫ్యాషనిస్టాని ఏమాత్రం దాచి పెట్టడం లేదు. వరుస ఫోటోషూట్లతో విజృంభిస్తోంది. సమంత తన అందాన్ని మరింత పెంచే స్కిన్ టైట్ దుస్తులలో తాజాగా తన సెన్సేషనల్ ఫిగర్ ను ప్రదర్శించింది. జల్లెడను తలపిస్తున్న డిజైనర్ డ్రెస్ లో సమంత ఎంతో హాట్ గా కనిపిస్తోంది. మునుపటి కంటే ఈ లుక్ లో హాట్ గా ఎలివేట్ అయ్యింది సామ్.

కెరీర్ పరంగానూ గ్లామరస్ యాంగిల్ ని ఎలివేట్ చేసేందుకు ఏమాత్రం సంకోచించడం లేదని సిగ్నల్స్ ఇచ్చేస్తోంది. దశాబ్ద కాలంగా పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ సమంత ఇప్పటికీ బోల్డ్ నెస్ ని కొనసాగిస్తూ..చర్చల్లోకొస్తోంది. ఇక ఈ ఫోటోగ్రాఫ్ లో డీప్ గా పరిశీలిస్తే సామ్ లో బోల్డ్ యాంగిల్ బయటపడినా .. ఆ కళ్లలో ఏదో మెరుపు మిస్సయ్యిందని అభిమానులు భావిస్తున్నారు. దానికి కారణమేమిటో ప్రత్యేకించి ఊహించాల్సిన పని లేదు.

సమంత ఇప్పుడు ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఉన్న రెండు ద్విభాషా ప్రాజెక్ట్ లను కూడా లైన్ లో పెట్టింది. బాలీవుడ్ లో తాప్సీ నిర్మించే సినిమాలో నటించనుంది. గుణశేఖర్ – శాకుంతలంలో నటించింది. ఈ సినిమా త్వరలో విడుదల కావాల్సి ఉంది.