సమంత నెం.1 పొజిషన్ కంటిన్యూ

టాలీవుడ్ లో ఎంతో మంది కొత్త హీరోయిన్స్ తెరంగేట్రం చేస్తూనే ఉన్నారు. ప్రతి ఏడాది కొత్త హీరోయిన్స్ ఎంతో మంది ఎంట్రీ ఇస్తున్నారు.. పాత వారు మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ అవుతూ వెళ్తున్నారు. కాని కొందరు హీరోయిన్స్ మాత్రం కొత్త వారు ఎంత మంది వచ్చినా అలాగే కంటిన్యూ అవుతున్నారు. దశాబ్ద కాలంగా టాలీవుడ్ లో కొందరు హీరోయిన్స్ టాప్ హీరోయిన్స్ గా కంటిన్యూ అవుతున్నారు. వారిలో సమంత.. తమన్నా.. అనుష్క.. కాజల్ లు ఉన్నారు. ఎంత కాలం అయినా కూడా వీరు అంటే అభిమానులకు మొహం మొత్తడం లేదు. వీళ్లు సినిమాలు చేసినా చేయకున్నా… పెళ్లిళ్లు చేసుకున్నా.. ప్లాప్ లు అవుతున్నా కూడా వారిని అభిమానులు ఆధరిస్తూనే ఉన్నారు. టాలీవుడ్ స్టార్స్ కు సంబంధించిన ర్యాంకింగ్స్ ను ఇచ్చే ఆర్మాక్స్ సంస్థ నవంబర్ నెలకు గాను తమ సర్వే ఫలితాన్ని విడుదల చేసింది.

హీరోల విషయంలో ఎప్పటిలాగే టాప్ లో మహేష్ బాబు ఉన్నాడు. ప్రభాస్ నెం.2 స్థానంలో నిలిచాడు. హీరోల జాబితాతో పాటు హీరోయిన్స్ టాప్ 10 జాబితాను కూడా ఆర్మాక్స్ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో సమంత నెం.1 స్థానంను కొనసాగించింది. ఈ ఏడాది ఆరంభం నుండి ఆమె స్థానం పదిలంగానే ఉంటూ వస్తుంది. పెళ్లి.. విడాకులు.. సినిమాలు.. వెబ్ సిరీస్ లు ఇలా ఎన్నో విషయాలతో సమంత ఎప్పుడు మీడియాలో ఉంటూనే ఉంది. అందుకే ఆమె పాపులర్ స్టార్ గా అభిమానులు చెబుతున్నారు. సర్వే సంస్థ సమంతను నెం.1 గా చెబుతూ పేర్కొంటూ వచ్చింది. సమంత నెం.1 స్థానం లో కంటిన్యూ అవ్వగా రెండవ స్థానంలో కాజల్ అగర్వాల్ నిలిచింది. పెళ్లి చేసుకుని సినిమాలు తగ్గించినా కూడా కాజల్ ను అభిమానించే వారు చాలా మంది ఉన్నారు.

నెం.3 స్థానంలో అనుష్క నిలిచింది. ఈమె సినిమాలు వచ్చి చాలా కాలం అవుతున్నాయి. అయినా కూడా ఆమెను అభిమానులు రెగ్యులర్ గా తల్చుకుంటూనే ఉన్నారు. ఇక నెం.4 స్థానంలో పూజా హెగ్డే నిచింది. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిన పూజా హెగ్డే నెం.4 స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నెం.5 స్థానంను కీర్తి సురేష్ మరియు నెం.6 స్థానాలను సాయి పల్లవిలు దక్కించుకున్నారు. నెం.7 లో తమన్నా నిలువగా నెం.8 లో రష్మిక మందన్నా నిలిచింది. ఇక నెం.9 లో రకుల్ ప్రీత్ సింగ్ నిలువగా నెం.10 లో రాశి ఖన్నా నిలిచారు. ప్రస్తుతం వారు చేస్తున్న సినిమాల ఆధారంగా కాకుండా వారి స్టార్ డమ్ ఆధారంగానే.. అభిమానుల్లో ఉన్న ఆధరణతో వారికి స్థానాలు దక్కాయి.