అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప సినిమా మంచి వసూళ్లను దక్కించుకుని కమర్షియల్ హిట్ గా నిలిచింది. టాక్ విషయంలో మొదట కాస్త అటు ఇటు అన్నట్లుగా వచ్చినా కూడా వసూళ్లు మాత్రం చాలా పాజిటివ్ గా వచ్చాయి. అభిమానులు మరియు యూనిట్ సభ్యులు ఆశించిన నెంబర్స్ నమోదు అయినట్లుగానే కనిపిస్తున్నాయి. చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాలను దక్కించుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇక అల్లు అర్జున్ మాస్ యాక్షన్ తో పాటు సుకుమార్ అద్బుతమైన టేకింగ్ తో పాటు ఈ సినిమా కు సమంత ఐటెం సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనడంలో సందేహం లేదు. సినిమా ఒక మంచి విజయాన్ని నమోదు చేసింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సమంత ఐటెం సాంగ్ విషయంలో మొదట్లో కొన్ని విమర్శలు.. అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ సమయంలో సమంతతో ఐటెం సాంగ్ అంటే ఖచ్చితంగా పుష్ప మేకర్స్ రిస్క్ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే సమంత ఐటెం సాంగ్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో కూడా సమంత ఐటెం సాంగ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ పాటకు సమంత ఒప్పుకోవడం వల్లే ఇది సాధ్యం అయ్యింది అన్నట్లుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. తాజాగా జరిగిన థ్యాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ మరో సారి సమంతకు థ్యాంక్స్ చెప్పారు.
ఈ ఐటెం సాంగ్ చేసే సమయంలో సమంతకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాని నేను ఆమె తో మాట్లాడిన తర్వాత నా పై నమ్మకంతో మేము ఏది అడిగితే అది అలా చేసి వెళ్లారు. ఆమె పూర్తిగా మమ్మల్ని నమ్మి ఈ పాట చేయడం జరిగింది. ఆమె ధైర్యం ఆమె తెగువకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను అన్నట్లుగా బన్నీ చెప్పుకొచ్చాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక అభిమాని షేర్ చేసిన వీడియోకు సమంత సమాధానంగా ఇక నుండి ఎప్పటికీ మిమ్ములను నమ్ముతూనే ఉంటాను అన్నట్లుగా సమాధానం ఇచ్చింది. సమంత ఇలాంటి ఐటెం సాంగ్స్ ను ముందు ముందు మరిన్ని చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నటి అన్నప్పుడు అన్ని రకాలుగా నటించాల్సిందే. ఐటెం సాంగ్స్ అందుకు భిన్నం కాదు అనేది చాలా మంది అభిప్రాయం. అందుకే సమంత ఐటెం సాంగ్ ను ప్రతి ఒక్కరు కూడా స్వాగతించారు.