చిన్న హీరోయిన్స్ కు సమంత అన్యాయం!

సమంత ఈమద్య కాలంలో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. వెండి తెర.. బుల్లి తెర.. ఓటీటీ.. ఐటెం సాంగ్.. టాక్ షో.. వెబ్ సిరీస్.. ఇలా ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంది. తాజాగా ఒక మాల్ ఓపెనింగ్ కు కూడా సమంత హాజరు అయ్యింది. సహజంగా అయితే స్టార్ హీరోయిన్స్ మాల్స్ ఓపెనింగ్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపించరు. వారి పారితోషికం కోట్ల రూపాయల్లో ఉండటం వల్ల మాల్ ఓపెనింగ్ కు వచ్చే మొత్తం వారికి తక్కువ అవుతుంది అనే టాక్ ఉంది.

రెండు మూడు కోట్ల పారితోషికం తీసుకునే సమంత ఇరువై లక్షల కోసం మాల్ ఓపెనింగ్ కోసం వెళ్లడం విడ్డూరంగా ఉందంటూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా సమంత నల్లగొండలో ఒక షాపింగ్ మాల్ ను ఓపెన్ చేసేందుకు వెళ్లింది. అక్కడ ఆమె ను చూసేందుకు భారీ ఎత్తున జనాలు వచ్చారు. అక్కడ దాదాపుగా గంట పాటు సమంత సందడి చేశారు. ఆ సమయంలో అభిమానులను ఉద్దేశించి సమంత మాట్లాడారు.

నల్లగొండ వంటి ఒక జిల్లా కేంద్రంలో సమంత షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం ద్వారా 15 లక్షల కంటే ఎక్కువ పారితోషికం రాకపోవచ్చు. అయినా కూడా సమంత అంత దూరం ఎందుకు వెళ్లారు అంటూ కొందరు జుట్టు పీక్కుంటున్నారు. ఇదే సమయంలో కొందరు నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు. చిన్న హీరోయిన్స్ కు ఈ రిబ్బన్ కట్టింగ్స్ వదిలేయకుండా సమంత వాటిని కూడా చేయడం బాగా లేదు అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

చిన్న హీరోయిన్స్.. అప్ కమింగ్ హీరోయిన్స్ అలాంటి రిబ్బన్ కట్టింగ్స్ కు వెళ్తూ ఉంటారు. కాని సమంత వెళ్లడం వల్ల వారికి ఆఫర్ పోయినట్లే కదా అంటూ వింత లాజిక్ లు తీసి కొందరు సమంత ను ట్రోల్ చేస్తున్నారు.

సమంత ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కనుక ఆమె ను ఆహ్వానించారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ మరియు సౌత్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న సమంత ఇలా మాల్ ఓపెనింగ్స్ కు వెళ్లడం ను కొందరు అభిమానులు సమర్థిస్తూ ఉంటే మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు.

సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల అయ్యింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. మరో వైపు తమిళంలో ఈమె నటించిన కాతువాకుల రెండు కాదల్ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. ఇవే కాకుండా బాలీవుడ్ లో రెండు సినిమాలు ఒక వెబ్ సిరీస్ కు కూడా సమంత ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.