విజయ్ సినిమాలో కశ్మీరీ బ్యూటీగా సమంత

విజయ్ దేవరకొండ, సమంత కలిసి మహానటి సినిమాలో పెయిర్ గా నటించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది కూడా. ఇక మరోసారి వీరిద్దరూ స్క్రీన్ ను షేర్ చేసుకోనున్నారు. వీరు నటించనున్న చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేయనున్న విషయం తెల్సిందే.

ఇక తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 21న ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. అలాగే ఏప్రిల్ 23న ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో ఆర్మీ వ్యక్తిగా నటించనుండగా, సమంత కశ్మీరీ బ్యూటీగా కనిపించనుంది. ఈ భారీ తొలి షెడ్యూల్ రెండు నెలల పాటు కాశ్మీర్ లో షూట్ చేస్తారట. దీంతోనే మెజారిటీ షూటింగ్ పార్ట్ ను ఫినిష్ చేస్తారని తెలుస్తోంది.

వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వస్తాయి.