పుష్ప చిత్రంలో సమంత స్పెషల్ సాంగ్ ఎంతటి సంచలనమో తెలిసిందే. ఊ అంటావా ఊఊ అంటావా? అంటూ అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారు కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిచ్చింది. సామ్ కెరీర్ లోనే బోల్డ్ ఐటమ్ సాంగ్ ఇది. ఈ పాటకు జాతీయ స్థాయిలో ఒక రేంజులో ఐడెంటిటీ దక్కింది.
ఇక ఇదే ఊపులో వరుసగా మరిన్ని బోల్డ్ ఐటమ్ నంబర్లకు సంతకాలు చేసేందుకు సమంత సిద్ధమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి ఆఫర్ విజయ్ దేవరకొండకు ఉంటుందనేది ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం దేవరకొండ లైగర్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. పూరి జగన్నాథ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సామ్ తో ఐటమ్ కోసం చర్చలు సాగిస్తున్నారట.
విడాకుల తర్వాత సమంత అన్నివిధాలా స్పీడ్ పెంచిందని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని బోల్డ్ పాత్రలు చేస్తూ హెడ్ టర్నర్ గా మారుతోంది. ఇక లైగర్ లో ఐటమ్ నంబర్ అంటే పూరి ఒక రేంజులోనే సామ్ అందాల్ని ఎలివేట్ చేస్తాడనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ అది వైరల్ గా మారింది. ఇంతకుముందు బన్ని తో అదిరే స్టెప్పులేసిన సామ్ దేవరకొండతోనూ కిక్కిచ్చే స్టెప్పులు వేయనుందని అభిమానులు ఊహిస్తున్నారు. ఇంతకుముందు మహానటిలో దేవరకొండ సరసన సామ్ నటించింది. ఈ జంటకు గొప్ప పేరొచ్చింది. ఇప్పుడు మరో అవకాశం వస్తే చెలరేగుతారనే అంచనా వేస్తున్నారు. అయితే ఈ వార్తల్ని అధికారికంగా లైగర్ టీమ్ ధృవీకరించాల్సి ఉంటుంది.