ఏడాది కాకుండానే హీరోయిన్ పెళ్లి పెటాకులు?


సినిమా పరిశ్రమలో ప్రేమలు పెళ్లిలు ఎంత కామన్ గా జరుగుతూ ఉంటాయో అంతే కామన్ గా విడాకులు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు తో విడిపోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. అంతకు ముందు ఆ తర్వాత కూడ ఆ పలువురు సినీ ప్రముఖులు తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక మీడియాలో ఎప్పుడు ఎవరో ఒకరు విడాకులు తీసుకున్నారని లేదంటే విడాకులు తీసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా కన్నడ మీడియాలో సంజన గర్లానీ విడాకులు తీసుకునేందుకు సిద్దం అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె గురించి కన్నడ మీడియాలో వస్తున్న వార్తలతో వారిద్దరు దాదాపుగా విడిపోయినట్లే అంటూ అంతా ఒక నిర్ణయానికి వస్తున్నారు. కాని ఇప్పటి వరకు వారి నుండి ఎలాంటి అప్ డేట్ అయితే లేదు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మద్య సఖ్యత లేదని.. కనుక ఇద్దరు కూడా విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి మద్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నా కూడా పెళ్లి అయ్యింది మాత్రం గత ఏడాదిలోనే అనే విషయం తెల్సిందే.

పెళ్లి అయ్యి ఏడాది కూడా కాకుండానే పెళ్లి బంధంకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకునేంత తప్పులు ఎవరు చేశారు.. ఇద్దరి మద్య విభేదాలకు కారణం ఏంటీ అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అంతా కూడా సంజన స్పందన ఏంటీ అంటూ ఎదురు చూస్తున్నారు. కొందరు మీడియా వారు ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నించగా ప్రస్తుతానికి తాను ఏమీ మాట్లాడలేను అంటూ చెప్పిందట. దాన్ని బట్టి ఇద్దరి మద్య విభేదాలు ఉన్నాయని మరింతగా స్పష్టం అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.