మహేష్ తో KGF 2 అధీరా గొడవేమిటి?

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి` తరువాత.. సౌత్ నుంచి ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ గొప్ప విజయం అందుకుంది. కేజీఎఫ్ చాప్టర్ 2 పై సినీ ప్రేమికులలో ఉన్న క్రేజ్ సరిహద్దులను దాటింది. KGF చాప్టర్ 2 అలాగే ఈ చిత్రంలో తారాగణంపై ఏదైనా అప్ డేట్ లేదా బజ్ ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో అప్ డేట్ వేడెక్కిస్తోంది.

తాజా మీడియా నివేదికల ప్రకారం.. రాకింగ్ స్టార్ యష్ KGF 2 తో సౌత్ లో అడుగుపెడుతున్న సంజూ భాయ్ అలియాస్ అధీరా మహేష్ బాబు తో ఘర్షణకు సిద్ధమవుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమాలో దత్ విలన్ గా నటించే అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. సూపర్స్టార్ మహేష్ సినిమాలో సంజయ్ దత్ ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మహర్షి తర్వాత పూజా హెగ్డే మరోసారి మహేష్ బాబు సరసన నాయికగా నటిస్తున్న సంగతి తెలిసినదే.

అయితే ఈ సినిమా కోసం సంజయ్ దత్ ఆమోదం తెలిపారా లేదా? ఈ పాత్ర కోసం మేకర్స్ మున్నాభాయ్ అలియాస్ సంజయ్ దత్ ని సంప్రదించారా లేదా? అనేదానిపై అధికారికంగా కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇటీవల హోంబలే ఫిల్మ్స్ KGF చాప్టర్ 2 తుది విడుదల తేదీని ప్రకటించింది. 22 ఆగస్టు 2021 న థియేట్రికల్ విడుదల తేదీ అని ప్రకటించినా అది కుదరలేదు. తదుపరి రిలీజ్ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది.

KGF చాప్టర్ 2 లో శాండల్ వుడ్ రాకింగ్ స్టార్ యష్ సరసన శ్రీనిధి శెట్టి నాయిక. ఇందులో సంజయ్ దత్ ప్రధాన విలన్ అధీరాగా నటించారు. రవీనా టాండన్ రమికా సేన్ (ప్రధాన మంత్రి) పాత్రలో నటించారు. అంతేకాకుండా.. విజయేంద్ర ఇంగల్గిగా ప్రకాష్ రాజ్ .. సీబీఐ అధికారిగా రావు రమేష్ నటించడం ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. సీక్వెల్ కాని కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని ప్రశాంత్ నీల్ ఇంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే.