నటుడు శరత్ కుమార్ కు కరోనా

ప్రస్తుతం ప్రజలందరూ కరోనా అంటే లైట్ తీసుకుంటున్నారు కానీ అది ఇంకా మన దేశంలో విస్తృత స్థాయిలోనే ఉంది. ఇప్పటికీ కరోనా సోకుతున్న వారి సంఖ్య భారీగానే ఉంటోంది. ముఖ్యంగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా నటుడు రాజశేఖర్ కరోనా నుండి కోలుకుని తిరిగి డిశ్చార్జ్ అయిన విషయం తెల్సిందే.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నటుడు శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. శరత్ కుమార్ కు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా అతని భార్య నటి రాధికా తెలియజేసారు.

“శరత్ కు హైదరాబాద్ లో కరోనా సోకింది. అతనికి ఎటువంటి లక్షణాలు లేవు. అయితే శరత్ కుమార్ హైదరాబాద్ లోని ఎఫిషియంట్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. అతని ఆరోగ్యం గురించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తాను” అని రాధికా ట్వీట్ చేసింది.

ఇక శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేసింది. సినిమా షూటింగ్ నిమిత్తం శరత్ కుమార్ హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.