ఫుల్‌ పాజిటివ్ బజ్ తో ‘సర్కారు వారి పాట’ రిలీజ్ కు రెడీ

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. పరశురామ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. గీత గోవిందం సినిమా తర్వాత మహేష్ బాబు తో పరశురామ్‌ సినిమా అంటే అదే తరహాలో ఉంటుందని అంతా భావించారు. కాని ట్రైలర్‌ విడుదల తర్వాత ఒక పోకిరి ఒక దూకుడు సినిమాల స్థాయిలో సర్కారు వారి పాట ఉండబోతుంది అంటూ మహేష్ బాబు అభిమానులు నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.

ఇటీవల విడుదల అయిన ఆచార్య సినిమా విడుదల సమయంలో ఇంత పాజిటివ్ బజ్ ను కలిగి లేదు. కాని ఈ సినిమా మాత్రం ప్రమోషనల్‌ స్టఫ్‌ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. మమ మహేష పాట లో మహేష్‌ మరియు కీర్తి సురేష్‌ మాస్‌ స్టెప్పులు కూడా సినిమా పై అంచనాలను అంతకంతకు పెంచాయి అనడంలో సందేహం లేదు. పుల్‌ పాజిటివ్‌ బజ్ తో విడుదల కాబోతున్న సర్కారు వారి పాట సినిమా ఖచ్చితంగా రికార్డు స్తాయి ఓపెనింగ్స్ ను కుమ్మేయడం ఖాయం.