ఉత్తరాది సీరియల్స్ నాగిని, మహాభారతం ఫాలో అయ్యేవారికి నటి సయాంతనీ ఘోష్ సుపరిచితమే. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యం గురించి నెటిజన్లకు సలహాలు ఇవ్వాలనుకున్న ఆమెకు లైవ్ చాట్లో ఓ నెటిజన్ ‘నీ బ్రా సైజ్ ఎంత’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆమె దిమ్మదిరిగిపోయే సమాధానం ఇచ్చింది.
‘మహిళల సైజుల గురించి అడుగుతున్నావ్. వాటికి అంత ప్రాముఖ్యత ఎందుకు. శరీరంలోని ఒక అంగాన్ని నీచంగా చూసే నీ మానసిక పరిపక్వత ఎంతో ఆలోచించు. అందాన్ని శరీరంలో కాదు.. మనసులో చూడు. నీ పురుషాంగం సైజ్ ఎంతంటే ఏం చెప్తావు. నీలాంటి వాళ్లకి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు మానసిక చికిత్స ఎంత అవసరమో అర్ధమవుతోంది. నీలాంటివాళ్ల వల్లే ముఖానికి మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నాం. నా సమాధానం నచ్చితే లవ్ సింబల్ పోస్ట్ చెయ్’ అంటూ ఘాటు సమాధానం ఇచ్చింది. ఆ నెటిజన్ ను తిడుతూ.. సయాంతనీని మెచ్చుకుంటూ కామెంట్లు వస్తున్నాయి.