బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఇటీవల తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేశాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పాడు. పలువురు పలు రకాలుగా ప్రశ్నలు అడుతున్న సమయంలో షారుఖ్ కొన్ని ప్రశ్నలకు చలోక్తిగా సమాధానం చెప్పాడు. మొత్తంగా షారుఖ్ అభిమానులు అడిగిన ప్రశ్నలు మరియు ఆయన చెప్పిన సమాధానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
షారుఖ్ ఖాన్ ను ఒక అభిమాని ఈ ఏడాది మీరు ఐపీఎల్ లో కేకేఆర్ నుండి కోరుకుంటున్నది ఏంటీ అంటూ ప్రశ్నించగా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండి మంచి ఆట తీరును కనబర్చాలి. ప్రతి ఒక్క ఆటగాడు కూడా మంచి ఆటతో ప్రేక్షకులను రంజింపజేయాలని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అలాగే ట్రోఫీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కూడా ఆశిస్తున్నాను అన్నాడు. ఇక కప్పు గెలిస్తే అన్న ప్రశ్నకు షారుఖ్ సరదాగా అందులో కాఫీ తాగడం మొదలు పెడతానంటూ కామెంట్ చేశాడు. మొత్తానికి ఐపీఎల్ పై షారుఖ్ చాలా ఆశలు పెట్టుకున్నట్లుగా మాత్రం చెప్పాడు.