శ్రద్ధ ఊ అంటావా డాన్స్… 100వ దశ అంటూ బన్నీ ఫన్

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప సినిమా కమర్షియల్ గా బిగ్గెస్ట్ సినిమా గా 2021 సంవత్సరానికి గాను నిలిచిన విషయం తెల్సిందే. ఇక 2022 లో కూడా పుష్ప మ్యూజిక్ సోషల్ మీడియాను కుదిపేస్తూ ఉంది. పుష్ప సినిమా లోని ఊ అంటావా ఊఊ అంటావా మరియు శ్రీవల్లి పాటలకు కాలు కదపని సెలబ్రెటీ లేడు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఆ రెండు పాటలకు డాన్స్ చేయకుంటే సోషల్ మీడియాలో ఉండి దండగా అని కొందరు.. ఆ రెండు పాటలతో రీల్స్ చేయకుంటే ఇన్నాళ్లు చేసిన రీల్స్ అన్నీ వృదా అన్నట్లుగా నెట్టింట జోరు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పుష్ప పాటకు కాలు కదుపుతూ.. చేయి గడ్డం కింద పెట్టుకుని తగ్గేదేలే అంటున్నారు. తాజాగా పుష్ప ఊ అంటావా పాటకు హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ కూడా డాన్స్ చేసింది.

పుష్ప హ్యాంగోవర్.. ఊ అంటావా పాట సూపర్.. పాటతో సరదాగా డాన్స్ అంటూ వీడియోను షేర్ చేసి అల్లు అర్జున్ ను ట్యాగ్ చేసింది. శ్రద్దా దాస్ వీడియోకు బన్నీ కూడా స్పందించాడు. 100వ దశ హ్యాలోజినేషన్(బ్రాంతీ) అంటూ పన్నీ రీ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన పుష్ప సినిమా మ్యానరిజం లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. క్రికెట్ స్టేడియం.. ఫుట్ బాల్ స్టేడియం.. కబడ్డీ గ్రౌండ్ ఇలా ప్రతి చోట కూడా పుష్ప లా తగ్గేదే లే అంటూ కుమ్మేస్తున్నారు. కొందరు పుష్ప చెప్పు విడిచే స్టెప్పు వేస్తూ కన్నుల వింధు చేస్తున్నారు. మొత్తానికి పుష్ప ను సోషల్ మీడియా లో ఇమిటేట్ చేస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది.

అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రథాన ఆకర్షణగా నిలిచింది. అద్బుతమైన పుష్ప పాటలకు కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి స్పందన వస్తోంది. పుష్ప శ్రీవల్లి హిందీ వర్షన్ ఏకంగా వంద మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది అంటే జనాలు అక్కడి వారు ఎంతగా పుష్ప ను ఆధరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటించడం కాకుండా జీవించేశాడు. ఇక పుష్ప రాజ్ రెండవ పార్ట్ కు సిద్దం అవుతున్నాడు. పుష్ప సినిమా పార్ట్ 1 కు వచ్చిన స్పందన తో పార్ట్ 2 ను అంతకు మించి అన్నట్లుగా సుకుమార్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ కూడా శ్రీవల్లిని మించిన ట్యూన్స్ ఇస్తేనే జనాలు సంతృప్తి చెందుతారు.
https://youtu.be/mWR7xHhHYBk