శ్రీయా ఈ వయసులో మ్యూజిక్ క్లాసులు?

పెళ్లయినా శ్రియ స్పీడ్ ఎంత మాత్రం తగ్గలేదు. సౌత్ అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియ ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ అంటూ అన్ని భాషల్ని చుట్టేస్తోంది. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` లో అతిథి పాత్రలో నటించింది. అలాగే యువ ప్రతిభాశాలి సృజనరావు దర్శకత్వంలో `గమనం` అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. ఇలా రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ మరోసారి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మరో ప్రతిష్మాతక చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించింది.

`మ్యూజిక్ స్కూల్` టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తాను ప్రధాన పాత్ర పోషిస్తోందట. ఇది చక్కని సందేశాత్మక చిత్రమని తెలిపింది. కళల గొప్పదనాన్ని.. కళల ద్వారా ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన వారి గురించి ఇందులో చెప్పబోతుందిట. ఇందులో శ్రియ మ్యూజిక్ స్కూల్ టీచర్ గా కనిపించనుంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇంజనీర్లుగా.. డాక్టర్లుగా చూడాలనుకుంటున్నారు తప్ప కళా రంగం. .. క్రీడల వైపు వైపు ఆసక్తి చూపించడం లేదు. తద్వారా ఎంతో మంది ఫ్యాషనేటెడ్ పిల్లలు తమ కలల్ని నిజం చేసుకోలేకపోతున్నారు అన్న పాయింట్ ని ప్రధానంగా హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుత సమాజాంపై సెటైరికల్ అంశాలు ఉంటాయని సమాచారం.

ఈ చిత్రానికి పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. పాపారావు న్యూయార్క్ ఫిల్మ్ ఇనిస్ట్యూట్ విద్యార్ధి. గతంలో `విల్లింగ్ టు త్యాగం` అనే ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఇది జాతీయ.. అంతర్జాతీయ అవార్డుల్ని సైతం అందుకుంది. ఇందులో బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి కూడా నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్..బ్రహ్మానందం వినయ్ వర్మ…గ్రేసీ గోస్వామి.. సుహాసిని ములాయ్.. ఓజు బారు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. చిత్రీకరణ అంతా హైదరాబాద్ .. గోవాల్లో ఉంటుంది. అక్టోబర్ 15న చిత్రం ప్రారంభం కానుంది.