పెళ్లి పై మరోసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్‌

యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన శృతి హాసన్‌ ఆ మద్య కాస్త గ్యాప్ ఇచ్చింది. వరుసగా సినిమాలు చేసిన శృతి హాసన్‌ ప్రేమ డేటింగ్‌ అంటూ ప్రియుడితో దేశ విదేశాలు చుట్టేసింది. బ్రేకప్ అయిన తర్వాత ఈ అమ్మడు మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటుంది. ఇప్పటికే క్రాక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె త్వరలోనే పవన్ కళ్యాణ్‌ తో నటించిన వకీల్‌ సాబ్‌ తో కూడా రాబోతుంది. మరో వైపు బాలీవుడ్ సినిమాలు కూడా ఈ అమ్మడు చేస్తుంది. వరుసగా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలతో బాలీవుడ్‌ లో కూడా బిజీ అయ్యింది.

గత కొంత కాలంగా ఈమె పెళ్లి గురించి పదే పదే వార్తలు వస్తున్నాయి. పెళ్లి గురించిన వార్తలపై తాజాగా సోషల్‌ మీడియా చిట్‌ చాట్ సందర్బంగా క్లారిటీ ఇచ్చింది. మీరు పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటీ అంటూ ప్రశ్నించగా నాకు ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ తో ఇప్పటికి స్నేహంగానే ఉంటాను అని అతడిపై కోపం కాని ద్వేషం కాని లేదని క్లారిటీ ఇచ్చింది. ఇతరులను ద్వేషించే తత్వం నాది కాదు అంది.

Share