నాలుగేళ్ల క్రితం వైరల్ ట్వీట్ పై శృతి హాసన్ రిప్లై

శృతి హాసన్ రెండేళ్ల విరామం తర్వాత మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీలోనే క్రాక్ చిత్రంతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో భారీ చిత్రం సలార్ లో హీరోయిన్ గా ఎంపికైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ప్యాన్ ఇండియా చిత్రం సలార్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం.

ఇదిలా ఉంటే సలార్ లో శృతి హాసన్ ను తీసుకోవడంపై కొన్ని కన్నడ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేసాయి. ఆమెకు కన్నడ ఇండస్ట్రీ అంటే గౌరవం లేదని నాలుగేళ్ల క్రితం ఆమె చేసిన ట్వీట్ ను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాయి.

నాలుగేళ్ల క్రితం ఆమె కన్నడ సినిమాను వదులుకుందని, కన్నడ పరిశ్రమపై ఆమెకు గౌరవం లేదని వస్తోన్న వార్తలపై ఆమె స్పందించారు. తనకు ప్రతీ ఇండస్ట్రీ అంటే అపారమైన గౌరవం ఉందని వివరించారు. కన్నడలో ఎట్టకేలకు సినిమా చేస్తుండడంపై ఆనందాన్ని వ్యక్తం చేసారు. అప్పుడు తన ట్వీట్ ను తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరించింది శృతి హాసన్.