అప్పటి నుండి నన్ను బ్యాన్‌ చేశారు

సౌత్‌ లో మీటూ ఉద్యమం సందర్బంగా వైరముత్తుపై చిన్మయి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. వైరముత్తు పై వ్యాఖ్యలు చేసినందుకు గాను తమిళ సినీ ఇండస్ట్రీలో చిన్మయిపై అనధికారికంగా బ్యాన్‌ విధించారు. గతంలో రాధారవి డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్‌ కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో చిన్మయి పై బ్యాన్‌ విధించారు. అప్పటి నుండి చిన్మయి న్యాయ పోరాటం సాగిస్తుంది. తమిళ సినిమాలకు ఆమె డబ్బింగ్ చెప్పకూడదని సీరియస్ గా యూనియన్‌ ఆదేశాలు ఇచ్చింది.

తాజాగా ఈ విషయమై ఆమె స్పందిస్తూ.. తెలుగు మరియు తమిళ సినిమా ల్లో డబ్బింగ్ ఆఫర్ల వల్ల కెరీర్ లో ముందుకు వెళ్తున్నాను. నాకు తమిళ సినీ ఇండస్ట్రీ నుండి తీవ్రమైన ఒత్తిడి ఉంది. న్యాయ పోరాటం చేస్తూ తమిళ సినీ ఇండస్ట్రీలో తనపై ఉన్న బ్యాన్ ను ఎత్తి వేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పింది. మొత్తానికి ఆమె కెరీర్‌ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పుకొచ్చింది. 2018 నుండి ఇప్పటి వరకు చిన్మయి పై సోషల్‌ మీడియాలో వైర ముత్తు మరియు రాధా రవి వర్గీయులు అసభ్య పదజాలంతో కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారట.