సింగర్ గా బుల్లి తెరపై సుదీర్ఘ కాలంగా కనిపిస్తూ ఉన్న నోయల్ కొన్ని సినిమాలు కూడా చేసి ఆకట్టుకున్నాడు. పలు ప్రైవేట్ ఆల్బమ్ లను చేసిన ప్రస్తుతం నోయల్ మారదే మారదే అనే ఒక రొమాంటిక్ పాటను చేస్తున్నాడు. దానికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఆల్బమ్ ను నోయల్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన హారిక మరియు వితిక షేరులు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ముగ్గురి కాంబోలో రాబోతున్న ఈ ఆల్బం ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హారిక మరియు వితిక షేరులు ఆన్ లొకేషన్‌లో బెడ్ రూం షాట్ ను డైరెక్ట్ చేస్తున్న ఫొటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ పాట అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నోయల్ నుండి ఇప్పటికే వచ్చిన ఆల్బమ్ సక్సెస్ అయ్యాయి. ఈ పాట కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ పాటకు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు డైరెక్షన్ చేస్తున్న కారణంగా మరింత హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ పాట గురించి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయితే జరుగుతోంది.