పాపులర్ సింగర్ ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ!

వెండితెరపై ఇప్పటి వరకు వారసులదే హవా నడుస్తూ వస్తోంది. అత్యధిక భాగం వారసులే ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వన్ కల్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ పంజా వైష్ణవ్ తేజ్.. ఇక అక్కినేని ఫ్యామిలీ దగ్గరికి వస్తే నాగార్జున తరువాత నాగచైతన్య అఖిల్ నందమూరి ఫ్యామిలీ గురించి చెప్పాలంటే బాలకృష్ణ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కల్యాణ్ రామ్ మాత్రమే నిలబడ్డారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీలో రానా స్టార్ అయిపోయాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి పరిచయమైన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

ఇలా ఇండస్ట్రీలో చాలా మంది వారసులు ఇప్పటికే హీరోలుగా సక్సెస్ సాధించి స్టార్ లుగా మారిపోయారు. ఇదే తరహాలో మరో వారసుడు ఇప్పుడు టాలీవుడ్ తెరపైకి రాబోతున్నారు. అయితే ఇతను హీరో నిర్మాత దర్శకులు ఫ్యామిలీ నుంచి కాకుండా సింగర్ ఫ్యామిలీ నుంచి హీరోగా తెరంగేట్రం చేయబోతుండటం గమనార్హం. సింగర్ సునీత ఇటీవల బిజినెస్ మెన్ రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ వివాహానికి ముందు సునీతకు ఓ పాప ఓ బాబు వున్నారు. ఈ ఇద్దరిలో ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలిసింది. త్వరలోనే తను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇందుకు సంబంధించిన పూర్తి వవరాలు త్వరలోనే బయటికి రానున్నట్టుగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ని రామ్ వీరపనేని స్వయంగా నిర్మిస్తారట. డైరెక్టర్ ఎవరు?.. నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలేంటీ వంటి విషయాల్ని త్వరలోనే వెల్లడించనున్నారట.