సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మహానటి` చిత్రంతో దుల్కర్ సల్మాన్ తొలి సారి తెలుగులో అడుగుపెట్టాడు. జెమినీ గణేషన్ పాత్రలో నటించి అమ్మాడీ అంటూ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ సినిమాలో దుల్కర్ పాత్రకు ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. తాజాగా మరోసారి తెలుగులో దుల్కర్ నటించారు. ఆయన హీరోగా తెరకెక్కిన మూవీ `సీతా రామం`.
హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. `యుద్థంతో రాసిన ప్రేమకథ` అంటూ పీరియాడిక్ నేపథ్యంలో సాగే ఫాంటసీ కథగా ఈ మూవీని తెరకెక్కించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన లిరికల్ వీడియోలు టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.
చాలా మంది ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కీటక టెక్నీషియన్ లు సినిమాపై ప్రత్యేకంగా మినీ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీపై ఇందులో నటించిన దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.
ప్రతీ చోటా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటున్న ఈ మూవీ మరి కొన్ని గంటల్లో థియేర్లలో సందడి చేయబోతోంది. శుక్రవారం ఆగస్టు 5న అత్యంత భారీ స్థాయిలో తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ గురువారం ఈ మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు. కశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ మూవీని తెరకెక్కించారు. కీలక ఘట్టాల చిత్రీకరణ కోసం చిత్ర బృందం చాలా శ్రమించినట్టుగా తెలుస్తోంది.
2021 ఏప్రిల్ 7న కశ్మీర్ లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. మైనస్ 17 డిగ్రీల చలిలో టీమ్ దుల్కర్ మృణాలి ఠాకూర్ ఈ మూవీ కోసం కఠోరంగా శ్రమించారు. మంచు కొండల మధ్య చిత్రీకరించిన వార్ సన్నివేశాలు.. పీరియాడిక్ లుక్ కోసం భారీ హెరిటేజ్ కట్టడాల్లో షూటింగ్ చేసిన సీన్స్ రష్యాలో ప్రధాన ఘట్టాలని చిత్రీకరించిన తీరు…వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు దర్శకుడు హను రాఘవపూడి కన్న కలలని వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో ఏ విషయంలోనూ ప్రొడక్షన్ కంపనీ రాజీపడని తీరు కనిపించాయి.
ఓపెన్ చేయని ఓ లెటర్ నేపథ్యంలో సీత రామ్ ల అందమైన ప్రేమకథగా ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించినట్టుగా స్పష్టమవుతోంది. పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీ కావడంతో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడంల.. దర్శకుడికి కావాల్సినవి సమకూర్చడంతో వైజయంతీ మూవీస్ ఎక్కడా రాజీపడనట్టుగా కనిపిస్తోంది. గ్రాండీయర్ విజువల్స్ అంతకు మించిన మ్యూజిక్ సినిమాకు సమకూరడంతో ఆగస్టు 5న విడదుల కానున్న ఈ మూవీ ప్రతీ ఆడియన్ కు ఓ విజువల్ ఫీస్ట్ గా నిలవనుందని తెలుస్తోంది.