వర్మ సోదరుడు కరోనాతో మృతి

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కు వరుసకు సోదరుడు అయిన పి సోమ శేఖర్‌ కరోనాతో మృతి చెందారు. వర్మ సినిమాలు అయిన రంగీలా, దౌడ్‌, సత్య, కంపెనీ ఇంకా పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలను చూసుకున్నాడు. దర్శకుడిగా ఒక సినిమాను కూడా తెరకెక్కించాడు. రామ్‌ గోపాల్‌ వర్మతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఇండస్ట్రీలో ఈయనకు మంచి పేరు ఉంది. అయితే చాలా కాలం క్రితమే ఈయన ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి పోయాడు. దర్శకుడిగా ఒక సినిమాతోనే శుభం కార్డు వేశాడు. వేరే వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాడు.

సోమశేఖర్ మృతిపై బోణీ కపూర్‌ విచారం వ్యక్తం చేశాడు. తన తల్లికి కరోనా సోకిన సమయంలో ఆమెను బతికించుకునేందుకు ఆయన పడ్డ తపన చూశాను. ఆమెను బతికించుకున్నాడు కాని తను మాత్రం కరోనాకు బలి అయ్యాడు అంటూ బోణీ కపూర్‌ విచారం వ్యక్తం చేశాడు. మంచి వ్యక్తి అంటూ ఆయన గురించి ట్వీట్‌ చేశాడు. ఇండస్ట్రీకి చెందిన పలువురు కూడా సోషల్‌ మీడియా ద్వారా సోమ శేఖర్‌ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.