ఇంతగా వేడెక్కిస్తూ `సాంప్రదాయం` అంటోంది!


ప్రఖ్యాత డిజైనర్ అనామికా ఖన్నా విశిష్ఠత గురించి చెప్పాల్సిన పనే లేదు. భారతీయ పురాతన సాంప్రదాయాల్ని మేళవించిన ప్రత్యేక దుస్తుల్ని డిజైన్ చేసి వాటికి ప్రాచుర్యం కల్పించడం అనామికా ప్రత్యేకత. 28 మార్చి హోలీ సందర్భాన్ని పురస్కరించుకుని అనామికా డిజైన్ లో ప్రత్యక్షమైంది అందాల సోనమ్ కపూర్.

“ఈరోజుల్లో మనం చేసే పనుల్లో మంచితనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న చెడును ఎల్లప్పుడూ గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. హ్యాపీ హోలీ! ` అంటూ ఫ్యాషనిస్టా సోనమ్ ఈ అందమైన ఫోటోని షేర్ చేశారు. నాకు ఎప్పటికీ ఇష్టమైన అనామిక ఖన్నాతో కలకాలం ఇలా కొనసాగడం హోలీ జరుపుకోవడం ఉత్సాహాన్నిస్తుంది. ప్రపంచ పౌరుడి స్వరూపం అనామికా చేతితో రూపొందించిన డిజైన్ లో ఇముడుతుంది. ఆధునిక భారతదేశ సంస్కృతికి దాని వారసత్వానికి తగిన డిజైనర్ సమ్మేళనం ఈ రూపం అని సోనమ్ వెల్లడించారు.

సోనమ్ ఈ ప్రత్యేక సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా ఉన్నారు. అంతకుమించి ఎద అందాల ఎలివేషన్ తో మతులు చెడగొట్టారు! అంటూ బోయ్స్ వ్యాఖ్యానిస్తున్నారు. హోలీ పేరుతో ఫ్యాషనిస్టా ఇలా చెలరేగారేమిటి? అన్న సందేహం వ్యక్తమైంది. చాలా కాలంగా సోనమ్ వెండితెరకు దూరమైంది. తదుపరి సినిమా ఎప్పుడు? అంటూ ప్రశ్నిస్తున్నారు.