పుట్టినరోజు పార్టీలో కపూర్ సిస్టర్స్ హంగామా


పుట్టినరోజు పార్టీలో కపూర్ సిస్టర్స్ హంగామా చూశారుగా.. అక్కా చెల్లెళ్లు అంతా ఒకటే సందడి చేస్తున్నారు. అలా సందడి చేస్తుండగా మెరిసిన ఒక ఫ్లాష్ ఇదిగో ఇంత కలర్ ఫుల్ గ్రూప్ ఫోటోగా ఆవిష్కృతమైంది. ఈ ఫోటోని పెద్ద అక్క సోనమ్ కపూర్ స్వయంగా షేర్ చేశారు. ఇంతకీ బర్త్ డే ఎవరికి? అంటే.. ఇంకెవరు.. అందరిలోకి చిన్న చెల్లెలు ఖుషీ కపూర్ బర్త్ డే. అందుకే గారాల చెల్లెమ్మ కోసం సోనమ్ అండ్ గ్యాంగ్ ఇంతగా సందడి చేశారు.

బ్యూటిఫుల్ అకేషన్ ఇది. ఫోటోలో ఖుషీతో పాటు జాన్వీ .. సోనమ్ వీరి కజిన్ సిస్టర్ అన్షులా కపూర్ కూడా ఉన్నారు. బర్త్ డే గాళ్ ఖుషీ కపూర్ కి కజిన్ సోనమ్ శుభాకాంక్షలతో పాటు.. సోషల్ మీడియాలో చాలా ప్రేమను అందుకుంది.

ఖుషీ కపూర్ నిర్మాత సురీందర్ కపూర్ మనవరాలు. ఖుషీ తండ్రి బోనీ కపూర్ కూడా నిర్మాత. ఆమె తల్లి శ్రీదేవి నటి. ఖుషీ సోదరి జాన్వి ఇప్పుడు రైజింగ్ స్టార్. సోదరుడు అర్జున్ బాలీవుడ్ లో ఎదిగేస్తున్న హీరో. ఆమె బంధువులు సోనమ్ .. హర్షవర్ధన్ కపూర్ కూడా స్టార్లు. ఖుషీ సోదరి జాన్వి కపూర్ 2018 చిత్రం ధడక్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. మోడల్గా ఉండాలని కోరుకుంటున్న ఖుషీ కూడా ఔత్సాహిక నటిగా ఎదగాలన్న పట్టుదలతో ఉందట. ఆమె ఉన్నత చదువుల కోసం గత ఏడాది సెప్టెంబర్లో న్యూయార్క్ వెళ్లిన సంగతి తెలిసినదే.

ప్రస్తుతం భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్ లో ఉంటున్న సోనమ్ కపూర్ చివరిసారిగా 2019 చిత్రం `ది జోయా ఫాక్టర్`లో దుల్కర్ సల్మాన్ ..అంగద్ బేడీలతో కలిసి నటించారు. గత సంవత్సరం డాడీ అనీల్ కపూర్ తో కలిసి `ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా లగా`లో కూడా సోనమ్ కనిపించింది. తన తదుపరి ప్రాజెక్టులను మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు.