నా ఫస్ట్‌ లవ్ తెలుగు, నా భార్య తెలుగు అమ్మాయిః సోనూసూద్‌

లాక్‌ డౌన్‌ సమయంలో వలస కార్మికుల కోసం తనవంతు సాయం చేసి వేలాది మందిని వారి ఇంటికి చేరుకునేందుకు సాయం చేసిన సోనూసూద్‌ రియల్‌ హీరో అంటూ కీర్తించబడుతున్నారు. చదువుపై ఆశ ఉండి చదువుకోలేని వాళ్లను సోనూసూద్‌ తన మంచి మనసుతో చదివించేందుకు ముందుకు వస్తున్నాడు. రియల్‌ హీరో అంటూ సోనూ సూద్‌ ను అభిమానులు మాత్రమే కాకుండా సినిమా స్టార్స్ కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అలాంటి సోనూసూద్‌ తనకు తెలుగుపై తెలుగు వారిపై ఉన్న అభిమానంను చెప్పుకొచ్చాడు.

తాజాగా అల్లుడు అదుర్స్‌ సినిమా లో నటించిన సోనూసూద్ ఆ సినిమా గురించి మాట్లాడుతూ తనకు తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్‌ పై ఉన్న అభిమానంను చెప్పుకొచ్చాడు. నేను ఇతర భాషల్లో నటించినా కూడా నాకు మొదటి లవ్ తెలుగు. అందుకే తెలుగు సినిమాలు ఎక్కువ చేయాలనుకుంటాను. అలాగే నా భార్య తెలుగు ఇంటి అమ్మాయి అవ్వడం వల్ల కూడా తెలుగు వారు అంటే నాకు ప్రత్యేకంగా గౌరవం అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి సోనూ సూద్‌ తెలుగు వారిపై ఉన్న అభిమానంను ఇలా వ్యక్తం చేయడం పట్ల ప్రతి తెలుగు వారు గర్వించే విషయం.