సౌత్‌ ఇండియా నుండి ఒకే ఒక్కడు.. ప్రభాస్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డ్‌

గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రభాస్‌ అందుకుంటున్న కీర్తి ప్రతిష్టలు అన్ని ఇన్ని కావు. ఎన్నో అద్బుతమైన రికార్డులను దక్కించుకున్న ప్రభాస్‌ ఇటీవలే తన సాహో సినిమాతో జపాన్‌ లో సంచలనం సృష్టించాడు. 250 రోజుల పాటు జపాన్‌ లో సాహో కంటిన్యూగా ఆడుతూనే ఉంది. ఒక స్థానిక భాష సినిమా విదేశాల్లో ఏకంగా 250 రోజులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అది ఏ హాలీవుడ్‌ హీరోకు కూడా దక్కలేదు. ఇప్పుడు ప్రభాస్‌ ఖాతాలో మరో అద్బుతమైన రికార్డు నమోదు అయ్యింది.

ప్రముఖ యూకే ఈస్టర్న్‌ మ్యాగజైన్‌ వారు 50 మంది ప్రముఖ ఏషియన్‌ టాప్‌ సెలబ్రెటీల జాబితాను విడుదల చేసింది. ఏషియాకు చెందిన వారిలో అత్యధిక పాపులారిటీని దక్కించుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్‌ అయిన వారు ఎవరు అంటూ ఆ మ్యాగజైన్‌ ఒక సర్వే నిర్వహించగా నెం.1 స్థానంలో సోనూసూద్‌ కు పేరు దక్కింది. లాక్‌ డౌన్‌ సమయంలో ఆయన చేసిన సేవల కారణంగా నెం.1 గా నిలిచాడు. ఇక ప్రభాస్‌ 7వ స్తానంలో ఉన్నాడు. సౌత్‌ ఇండియా నుండి కేవలం ప్రభాస్‌ కు మాత్రమే ప్లేస్‌ దక్కింది.